Gold price | మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఆదివారం ఇలా భ‌గ్గుమంది ఏంటి?

Gold price | మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఆదివారం ఇలా భ‌గ్గుమంది ఏంటి?
Gold price | మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఆదివారం ఇలా భ‌గ్గుమంది ఏంటి?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold price | చూస్తుంటే బంగారం ధ‌ర ల‌కారానికి చేరుకోవ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్టేలా లేదు. రోజు రోజుకి బంగారం ధ‌ర‌లు Gold prices ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏప్రిల్ 13వ తేదీ బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది gold created a new record.

Advertisement
Advertisement

చరిత్రలో history ఎప్పుడు లేని విధంగా బంగారం Gold ధర 97 వేల రూపాయల సమీపానికి చేర‌డంతో సామాన్య ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump కొత్త ఆటో టారిఫ్‌లను auto tariffs ప్రకటించడంతో, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌ల నుంచి బయటకు వచ్చి బంగారంలో పెట్టుబడులు పెంచారు. ఈ క్ర‌మంలో బంగారం ధ‌ర ఆకాశాన్ని అంటుతుంది. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,670గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,700గా ఉంది.

Gold price | ముట్టుకుంటే షాకే..

మరోవైపు దేశరాజధాని ఢిల్లీ లో national capital Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95,820గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,850 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో పసిడి ధర గత వారం రోజుల్లో రూ.5010 పెరగడం విశేషం. గోల్డ్ రేట్లు Gold price ఏప్రిల్ 6న 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.90,660గా ఉండగా, ప్రస్తుతం ఏప్రిల్ 13న రూ.95,670కి చేరుకుంది. అంటే వారం రోజుల్లో 5 వేల రూపాయలకుపైగా పుంజుకుంది. మరోవైపు ఇదే సమయంలో ఏప్రిల్ 6న వెండి ధరలు హైదరాబాద్, విజయవాడలో Hyderabad and Vijayawada రూ. 1,03,000 ఉండగా, ప్రస్తుతం రూ.1,10,000కి చేరుకున్నాయి. అంటే సిల్వర్ silver కూడా బంగారం కంటే ఎక్కువగా 7 వేల రూపాయలు పెరిగింది. అంటే ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలే వ‌చ్చాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Piyush Goyal | అమెరికాతో కలిసి పని చేస్తాం : పీయూష్ గోయల్

దేశీయంగా చూసినట్లయితే బంగారం ధర Gold price 97 వేల రూపాయల సమీపానికి చేరింది. లక్ష రూపాయలకు కేవలం 3000 దూరంలో నిలిచింది. దీంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ Trump కెనడా, చైనా, యూరప్ China and Europe సహా పలు దేశాల పైన దిగుమతి సుంకాలను పెద్ద ఎత్తున విధిస్తూ వస్తుండ‌డంతో అమెరికా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ తీవ్రతరమవుతుండటంతో, సురక్షిత పెట్టుబడి అయిన బంగారం ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ఏకంగా 17 సార్లు రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్లింది.

Advertisement