అక్షర టుడే, వెబ్ డెస్క్ Today Gold Price : ఇప్పుడు బంగారం అంటేనే భయపడాల్సి వస్తుంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇన్నాళ్లు ధరల పెరుగుదలతో వెనకడుగు వేసిన వారందరూ ఇప్పుడు తమకు ఇష్టమైన (Gold Price) బంగారం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. రెండు రోజుల్లోనే తులం బంగారం ధర ఏకంగా రూ.2720 మేర తగ్గడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాలతో ఇన్నాళ్లు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే, పసిడిలో పెట్టుబడి పెట్టిన వారందరూ గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు దిగడంతో ధరలు ఒక్కసారిగా దిగివచ్చినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660 వద్ద ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులుంటాయి.
Today Gold Price : శుభవార్త..
హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములపై క్రితం రోజు ఏకంగా రూ.1740 మేర పడిపోగా ఇవాళ మరో రూ. 980 తగ్గింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.2720 దిగివచ్చింది. ఇప్పుడు తులం రేటు రూ. 90 వేల 660 వద్దకు పడిపోయింది. అలాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర (Gold Price) 10 గ్రాములకు క్రితం రోజు రూ.1600 తగ్గగా ఇవాళ మరో రూ. 900 తగ్గింది. దీంతో తులం రేటు రూ. 83, 100 వద్దకు పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం ధరలు పలు ప్రాంతాలలో ఎలా ఉన్నాయనేది చూస్తే..హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.90,660, విజయవాడలో 10 గ్రాముల ధర రూ.90,660గా ఉన్నాయి.
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.90,640 కాగా, ముంబైలో 10 గ్రాముల ధర రూ.90,660, కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.90,650, చెన్నైలో 10 గ్రాముల ధర రూ.రూ.90,660, బెంగళూరులో 10 గ్రాముల రూ.90,610, పుణెలో 10 గ్రాముల ధర రూ.90,600, అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.90,600, విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.90,590గా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.83,100, విజయవాడలో (Vijaywada) 10 గ్రాముల ధర రూ.83,200, ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.83,300, ముంబైలో 10 గ్రాముల ధర రూ.83,110, కోల్‌కతాలో 10 గ్రాముల రూ.83,110, చెన్నైలో 10 గ్రాముల ధర రూ.83,140, పుణెలో 10 గ్రాముల ధర రూ.83,110, బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.83,150, అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.83,100, విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.83,100.ఇకఇవాళ కిలో వెండి రేటు ఏకంగా రూ.5000 తగ్గింది. గత మూడు రోజుల్లో చూసుకుంటే ఏకంగా రూ.11000 మేర పడిపోయింది. దీంతో ఇప్పుడు కిలో వెండి ధర రూ. 1,03,000 వద్దకు దిగివచ్చింది.