
అక్షర టుడే, వెబ్ డెస్క్ DA Hike News : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం (Union Cabinet meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central government employees) …ఇటు రైతులు..రెండు వర్గాల పైన కూడా కేంద్రం వరాల జల్లు కురిపించింది. కరవు భత్యం 2 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం కరువు భత్యం పెంపును ప్రకటించింది. దీంతో 53% నుండి 55%కి పెంచూ నిర్ణయం తీసుకుంది. అయితే, గత 78 నెలల్లో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యంలో ఇది అత్యధిక పెరుగుదల అవుతుంది. కాగా ఉద్యోగులకు డీఏను రెండు నెలల బకాయిలను కలిపి మార్చి నెల జీతంతో పాటు ఇస్తారు.
DA Hike News : ఫుల్ హ్యాపీ..
తాజా నిర్ణయంతో జూలై ఒకటి నుంచి చెల్లించాల్సిన డియర్‌నెస్ అలవెన్స్ రేటు 53శాతం నుంచి 55శాతానికి పెరిగింది. కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు కోటిమందికిపైగా (employees) ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఇందులో 48లక్షల మంది ఉద్యోగులు, 67లక్షల మంది పెన్షనర్లు Pensioners ఉన్నారు.ఇది దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఇప్పుడు పెంచిన డీఏ జనవరి నుంచి అమలులోకి వచ్చినప్పటికీ ఏప్రిల్ శాలరీతో రానుంది. అంటే మే నెలలో ఉద్యోగుల చేతికి అందనుంది. అప్పుడు 3 నెలల ఎరియర్స్‌తో కలిపి ఉద్యోగుల, పింఛన్‌దారులకు ఇవ్వనున్నారు.
ప్రతి ఆరు నెలలకోసారి ప్రకటించే ఈ డీఏ ఈసారి మాత్రం ఆలస్యమైంది. జనవరి – జూన్ నెలలకు సంబంధించిన డీఏ DA HIKEను ఏటా హోలీ టైంలో ప్రకటించేవారు కాని ఈ సారి ఎందుకో ఆలస్యం అయింది. 2018 జులై నుంచి ప్రభుత్వం మూడు లేదా నాలుగు శాతం డీఏ పెంచుతూ వస్తోంది. ఈసారి మాత్రం రెండు శాతానికే పరిమితం చేయడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యం ప్రయోజనం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థలలో అంటే ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లభించదు. కేంద్రం డీఏను సవరించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది.