Champions Trophy | క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. మల్టీ ప్లెక్స్​లలో లైవ్​ టెలీకాస్ట్​

Champions Trophy | క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌
Champions Trophy | క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Champions Trophy | దేశంలో క్రికెట్​ను అభిమానించే వారు కోట్లలో ఉంటారు. భారత్​ మ్యాచ్​లు ఉన్నాయంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఐసీసీ టోర్నీల్లో భారత్​ ఆడుతుందంటే ఇక చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఐసీసీ టోర్నీల్లో ఫైనల్​ మ్యాచ్​లను చూడటానికి ఎంతో ఉత్కంఠతో, ఉత్సాహంతో ఉంటారు.

Champions Trophy | ఆదివారం ఫైనల్​ మ్యాచ్​

టీం ఇండియా ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్​తో తుదిపోరులో భారత్​ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​ను చూడటానికి ఇప్పటికే చాలామంది తమ ప్రోగ్రామ్​లను మార్చుకున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy : నెట్టింట వైరల్ అవుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పిక్స్

స్టేడియంలో మ్యాచ్​ చూడలేకున్నా.. కనీసం పెద్ద టీవీలు, స్క్రీన్​లలో చూడాలని అనుకుంటున్నారు. ఫ్రెండ్స్​తో కలిసి మ్యాచ్​ చూస్తూ ఎంజాయి చేయడానికి ప్లాన్​ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మల్టీప్లెక్స్​లు గుడ్​ న్యూస్​ చెప్పాయి. హైదరాబాద్​లోని పలు మల్టీ ప్లెక్స్​లలో ఆదివారం ఫైనల్​ మ్యాచ్​ను లైవ్​ ప్రసారం చేయనున్నాయి. దీంతో మల్టీప్లెక్స్​లలో మ్యాచ్​ చూడటానికి ఎంతోమంది సిద్ధం అవుతున్నారు.

Advertisement