అక్షరటుడే, వెబ్డెస్క్: farmers | భారత వాతావరణ శాఖ Meteorological Department రైతులకు farmers తీపికబురు చెప్పింది. వచ్చే సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు rainfall నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల southwest monsoon ప్రభావంతో దేశంలో సాధారణం కంటే అధిక వానలు rainfall కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. ఎల్నినో ప్రభావం తటస్థంగా ఉండడంతో వర్షాలకు ఢోకా ఉండకపోవచ్చని తెలిపింది.
farmers | సమృద్ధిగా వానలు..
దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం monsoon effect ఈసారి బాగుంటుందని వాతావరణ శాఖ Meteorological Department వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం 87 సెం.మీ. కాగా, ఈసారి 105 సెం.మీ. నమోదు కావొచ్చని అంచనా వేసింది. “2025లో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల southwest monsoon (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ” అని భారత వాతావరణ శాఖ Indian Meteorological Department ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో 96 నుంచి 105 శాతం మేర వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం తటస్థంగా కొనసాగే అవకాశముందని తెలిపింది.
farmers | ఆర్థిక వ్యవస్థకు వానలే ఆధారం..
ఏటా వర్షాకాలం monsoon season ఆరంభానికి ముందే పరిస్థితులను మన వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాతావరణ శాఖ ప్రకటించే అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థకు country economy ఎంతో కీలకంగా మారుతాయి. ఎందుకంటే మన జీడీపీ GDP వ్యవసాయ Agriculture, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉండడమే అందుక్కారణం. దేశంలో అత్యధికంగా వ్యవసాయం Agriculture వర్షాలపైనే ఆధారపడి ఉంది. వానలు సాధారణం లేదా అంతకంటే ఎక్కువ కురిస్తే మంచి దిగుబడులు రావడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. తద్వారా జీడీపీ పెరుగుతుంది GDP increase. అలాగే, మన దేశం నుంచి అనేక వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా విరివిగా పెరుగుతుంది. అయితే, వర్షాలు తక్కువగా ఉంటే అది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.