అక్షరటుడే, హైదరాబాద్: Gold Rate : బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతూ రూ.90 వేలు దాటిన స్వర్ణం, మూడు రోజులుగా రూ.880 తగ్గడం విశేషం.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం రికార్డు స్థాయిలో రూ.90,660కి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నాటికి రూ. 89,780 కి తగ్గి, కాస్త ఉపశమనం కలిగించింది.
అంతర్జాతీయంగా గతంలో చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులు..ప్రస్తుతం సద్దుమణుగుతుండటం, పెట్టుబడిదారులు మళ్లీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుండటంతో గోల్డ్ రేటు తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు.