toll pass | వాహనదారులకు గుడ్​ న్యూస్​.. ఏడాది టోల్​ పాస్​ రూ.3 వేలే!

toll pass | వాహనదారులకు గుడ్​ న్యూస్​..ఏడాది టోల్​ పాస్​ రూ.3 వేలే!
toll pass | వాహనదారులకు గుడ్​ న్యూస్​..ఏడాది టోల్​ పాస్​ రూ.3 వేలే!

అక్షరటుడే, న్యూఢిల్లీ: toll pass : టోల్​ ప్లాజా.. అంటే ఏ వాహనదారులకైనా చిరాకొస్తుంది. క్యూ కట్టడం, స్కానింగ్​ సరిగా లేకపోవడం, అంతా భరించి దారి దోపిడీకి గురికావడం.. ఇదీ టోల్​ ప్లాజాల వల్ల వాహనదారులకు ఎదురయ్యే దుస్థితి.

Advertisement

ఇక ఈ దారి దోపిడీకి చెక్​ పడనుంది. త్వరలోనే కొత్త జీపీఎస్​ విధానం రాబోతోంది. ఇదే గనుక అమల్లోకి వస్తే టోల్​ ప్లాజా సిస్టమే మాయం కాబోతోంది. జీపీఎస్ ద్వారా నేరుగా డబ్బులు చెల్లించే వ్యవస్థ రూపొందుతోంది. దీనివల్ల వాహనదారులకు డబ్బులు కూడా పెద్ద మొత్తంలో ఆదా కానున్నాయి.

దేశంలోని హైవేలు( highways), ఎక్స్ ప్రెస్​ వే(expressways) ల సమస్యల పరిష్కారం దిశగా.. కొత్త టోల్ పాలసీలో మార్పులు తీసుకొస్తున్నారు. టోల్​ రుసుములను 50 శాతం వరకు తగ్గించాలని కేంద్రంలోని సర్కారు(central government) భావిస్తోంది. దీనికితోడు రానున్న కాలంలో వాహనాల వార్షిక పాసులను రూ.3 వేలకే అందించాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పాస్​ అన్ని జాతీయ రహదారులతో పాటు రాష్ట్రాల అధీనంలో ఉండే ఎక్స్ ప్రెస్​ దారులపైనా చెల్లుబాటు కానుంది. ప్రస్తుతం నెలవారీ పాస్ లు మాత్రమే జారీ చేస్తున్నారు. కొత్త పాలసీ అమల్లోకి వస్తే.. ఏడాది కాలానికి పాస్ లు ఇస్తారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Karnataka | క‌ర్ణాట‌క‌లో లారీల స‌మ్మె.. నిలిచిన నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రా

టోల్​ పాస్​ రుసుమును ఫాస్టాగ్(FASTag) ద్వారానే చెల్లించడానికి వీలుంటుంది. కొత్త పాలసీలో టోల్ ప్లాజాల ఏర్పాటుకు బదులుగా కిలోమీటరుకు ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఉదాహరణకు పరిశీలిస్తే.. ఒక కారు వంద కిలోమీటర్లకు రూ.50 టోల్ ఫీజు చెల్లించాలి.

రానున్న కాలంలో జీపీఎస్ ఆధారిత విధానాన్ని(GPS-based system) అమలు చేయనున్నారు. దీని ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడంతో పాటు ఆలస్యాన్ని నివారించనున్నారు. దీని వల్ల ప్రయాణించిన కిలోమీటర్లకు మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతా నుంచి టోల్ కట్​ అవుతుంది. రానున్న 15 రోజుల్లో శాటిలైట్ ఆధారిత(satellite-based) టోల్ వసూలు విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) ప్రకటించారు.

Advertisement