అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Toll Gates | దేశంలో మరికొద్ది రోజుల్లో టోల్ గేట్లు Toll Gates మాయం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఏ హైవే highway tolls మీదకు వెళ్లిన టోల్ గేట్లు దర్శనమిస్తున్నాయి. ఆయా టోల్ ప్లాజాలతో tollplaza వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ సమయాల్లో చాలాసేపు టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఫాస్టాగ్‌తో Fastag టోల్ toll చెల్లింపులు వేగవంతం అయ్యాయి. అయినా కూడా పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టోల్ పాలసీలో new toll Policy కేంద్రం మార్పులు తీసుకు రానున్నట్లు సమాచారం.
Toll Gates | 15 రోజుల్లో కొత్త పాలసీ
దేశంలో కొత్త టోల్ పాలసీని 15 రోజుల్లో తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ union minister Nitin Gadkari ప్రకటించారు. దీని ప్రకారం ఇక టోల్ గేట్ల అవసరం ఉండదని ఆయన తెలిపారు. హైవే పైకి వాహనం రాగానే ప్రయాణించిన దూరాన్ని బట్టి బ్యాంక్ అకౌంట్ నుంచి శాటిలైట్ ట్రాకింగ్ satilite tracking ద్వారా డబ్బులు కట్ అవుతాయన్నారు. ప్రయాణించిన దూరానికి మాత్రమే డబ్బులు చెల్లించవచ్చని ఆయన వివరించారు.
Toll Gates | తప్పనున్న తిప్పలు
ప్రస్తుతం ఫాస్టాగ్ FAStag వ్యవస్థ వచ్చిన టోల్ బూత్‌ల వద్ద పలు సందర్భాల్లో ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా పండుగల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో వాహనదారుల సమయం, ఇంధనం వృథా అవుతున్నాయి. కొత్త టోల్ పాలసీ వచ్చి టోల్‌బూత్‌లు ఎత్తివేస్తే వాహనదారులకు తిప్పలు తప్పనున్నాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, టోల్ గురించి ఎవరూ ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండదని గడ్కరీ అన్నారు.
Toll Gates | ఎలా అమలు చేస్తారు..
ప్రస్తుతం టోల్ చెల్లించే వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకున్నారు. కొత్త పాలసీ అందుబాటులోకి వస్తే శాటిలైట్ ట్రాకింగ్ కోసం జీపీఎస్ లాంటి పరికరం వాహనాలకు అమర్చుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పాలసీ ప్రకటించిన అనంతరం కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. అనంతరం వాహనదారులకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది.