అక్షరటుడే, వెబ్‌డెస్క్:Motorola Laptop | లెనోవో సబ్ బ్రాండ్(Lenovo sub brand) అయిన మోటోరోలా motorola phone తొలి ల్యాప్‌టాప్ ను రిలీజ్ చేసింది. మోటో బుక్ 60 పేరుతో దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 14 అంగుళాల ఈ ల్యాపీ రెండు రంగుల్లో లభిస్తోంది. ఇంటెల్ కోర్ 5 సిరీస్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ వెర్షన్ ధరను రూ.69,999గా కంపెనీ ప్రకటించింది. ఆఫర్ కింద రూ.61,999కే విక్రయిస్తోంది.
ఇంటెల్ కోర్(Intel Core) 7 సిరీస్ ప్రాసెసర్ లో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. 16 జీబీ రామ్, 512 జీబీ వేరియంట్ ధర రూ.74990, 16 జీబీ రామ్, 1టీబీ వేరియంట్ ధరను రూ.78,990 గా కంపెనీ నిర్ణయించింది. వీటిపైన కూడా కంపెనీ ఆఫర్లు ఇస్తోంది. బ్రాంజ్ గ్రీన్(Bronze Green), వెడ్జ్ వుడ్ రంగుల్లో వీటిని అందిస్తోంది. ఏప్రిల్ 23 నుంచి ఫ్లిప్‌కార్టు(Flipkart)లో విక్రయాలు ఉంటాయి.
మోటో బుక్ 60 విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఉంది. ఇందులో 14 అంగుళాల 2.8K ఓఎస్ఈడీ డిస్ ప్లే(OSED display) పొందుపర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటు, 500 నిట్స్ పీక్ బ్రైటెనెస్ లో ఉంది. డాల్బీ విజన్(Dolby Vision), హెచ్డీఆర్ కు సపోర్ట్ చేయడం గమనార్హం. బటన్లెస్ మైలార్ టచ్ప్యాడ్ మరో ప్రత్యేక ఆకర్షణ. గ్రాఫిక్ కార్డుతో కూడిన ఇంటెల్ కోర్ 7 240H, ఇంటెల్ కోర్ 5 210H ప్రాసెసర్ ఆప్షన్ మరో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ర్యామ్ ను 32 జీబీ, ఎస్ఎస్ స్టోరేజీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీనికి 1080p వెబ్క్యామ్(10) ఇచ్చారు. ప్రైవసీ షట్టర్, ఫేస్ రికగ్నిషన్ కోసం ఐఆర్ కెమెరా ఇచ్చారు. సంగీతం వినాలనుకుంటే డాల్బీ అట్మాస్తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 2w ఆడియో ఔట్ పుట్ మంచి ఫీల్ ఇస్తుంది.
బ్లూటూత్ 5.4, వైఫై 7తో ఈ ల్యాపీ వస్తోంది. ఇందులో రెండు యూఎస్బీ టైప్-ఏ 3.2 జనరేషన్ పోర్టులు, రెండు యూఎస్బీ టైప్-సి 3.2 జనరేషన్ 1 పోర్టులు, హెచ్ఎఎంఐ పోర్ట్, ఒక డిస్ ప్లే పోర్టు 1.4, మైక్రోఎస్ఓ కార్డ్ స్లాట్, 3.5 ఎఎం ఆడియో జాక్ వంటివి పొందుపర్చారు. మరో ప్రత్యేకం ఏఐ పీచర్ల(AI features)ను కూడా జోడించడం. స్మార్ట్ కనెక్ట్, స్మార్ట్ క్లిప్బోర్డ్. ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లు ఉండటం విశేషం. మోటో బుక్ 60లో 60wh బ్యాటరీ పొందుపర్చారు. ఇది 65w ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. బరువు 139 కేజీలు.