అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Budget | రాష్ట్ర పోలీసులకు బడ్జెట్(Budget) లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) గుడ్న్యూస్ చెప్పారు. నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల(Telangana Police)కు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పోలీసుల పిల్లల చదువుల కోసం సైనిక్ స్కూల్ తరహాలో పాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పాఠశాలలో పోలీసు అధికారుల పిల్లలతో పాటు ఎక్సైజ్, అగ్నిమాపక, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, జైళ్ల శాఖలో పని చేసే ఉద్యోగుల పిల్లలకు కూడా ప్రవేశాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం వివరించారు.
Telangana Budget | హోంగార్డుల వేతనం పెంపు
బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి హోంగార్డుల(Homegaurds)పై కరుణ చూపారు. వారి రోజు వారి వేతనాన్ని రూ.921 నుంచి రూ.వెయ్యికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగంలో ఉండగా మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు.