అక్షరటుడే, వెబ్డెస్క్: POD Rooms | రైళ్ల(Trains)లో దూర ప్రాంతాలకు వెళ్లే వారు చాలా మంది ముందుగానే స్టేషన్కు చేరుకుంటారు. అంతేగాకుండా పలు రైళ్లు ఆలస్యం కావడంతో చాలా మంది గంటల కొద్ది రైల్వే స్టేషన్లలో నిరిక్షించిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారికి ఆయా స్టేషన్లలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం రైల్వేశాఖ స్టేషన్లో పాడ్(POD)రిటైరింగ్ రూమ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఈ రూమ్లో ముంబయిలో అందుబాటులో ఉండగా.. తాజాగా భోపాల్(Bhopal) రైల్వే స్టేషన్లో ప్రారంభించారు.
POD Rooms | పాడ్ గదులు అంటే..
పాడ్ గదులు లేదా క్యాప్సూల్ గదులు అని పిలువబడే వీటిని జపాన్(Japan)లో తయారు చేశారు. ఇవి ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. దేశంలో దీనిని మొదట ముంబయిలో అర్బన్‌పాడ్ అనే సంస్థ ప్రారంభించింది. ఇందులో క్యాప్సూల్ ఆకారంలో ఉన్న చిన్న గదులు ఉంటాయి. తక్కువ సమయం రెస్ట్ తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. స్థలం కూడా తక్కువ అసవరం కావడంతో వీటి వినియోగం పెరుగుతోంది. ఇందులో భాగంగా భోపాల్లో రైల్వే స్టేషన్లో వీటిని ఏర్పాటు చేశారు.
POD Rooms | ధర ఎంతంటే..
భోపాల్ రైల్వే స్టేషన్‌లోని 6లో 78 పాడ్‌లు ఉన్నాయి. ఒకరికి సరిపోయే పాడ్(రూమ్)కు మూడు గంటలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబానికి సరిపోయే పాడ్‌కు రూ.400 అద్దె ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవి రైల్వే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడతాని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి మంచి స్పందన వస్తుండటంతో త్వరలో మరిన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.