Schools Holidays : విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు

Schools Holidays : విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు
Schools Holidays : విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Schools Holidays : స్కూల్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్. తెలంగాణలోని అన్ని స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి. నిజానికి ఇంకో నెల అయితే వేసవి సెలవులే రాబోతున్నాయి. కానీ.. ఇంతలోనే మూడు రోజులు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఓవైపు ఒంటి పూట బడులు, మరోవైపు మూడు రోజులు వరుస సెలవులు.. మొత్తానికి స్కూల్ విద్యార్థులకు పండుగ అనే చెప్పుకోవాలి.

హోలీ పండుగ సరిగ్గా వీకెండ్​లో వస్తుండడంతో వరుసగా విద్యార్థులకు సెలవులు వచ్చేశాయి. హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ మార్చి 14న అంటే శుక్రవారం సెలవును ప్రకటించింది. ఆ రోజు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు కూడా పనిచేయవు. స్కూళ్లు కూడా ఆ రోజు బంద్ కానున్నాయి. ఆ తర్వాత శని, ఆదివారం రానుండడంతో శనివారం కూడా పాఠశాలలు మూత పడనున్నాయి. అంటే.. వరుసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయన్నమాట.

Schools Holidays : కొన్ని పాఠశాలలకు మాత్రమే శనివారం సెలవు

అయితే.. ప్రభుత్వం శనివారం అధికారికంగా సెలవు ఇవ్వకపోయినా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వరుసగా మూడు రోజులు సెలవులను ప్రకటించాయి. హోలీ సందర్భంగా శనివారం కూడా సెలవు ఇస్తే వరుసగా మూడు రోజులు విద్యార్థులు పండుగ చేసుకోనున్నారు. ఈ మూడు రోజులు ఇక విద్యార్థులకు పండుగే.

Advertisement