అక్షరటుడే, హైదరాబాద్: Health Scheme | రాష్ట్రంలోని వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం(central government) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ వయో వందన(Ayushman Bharat Vayo Vandana) అందుబాటులోకి రాబోతోంది. దీని ద్వారా 70 ఏళ్లు దాటిన వృద్ధులు లబ్ధి పొందనున్నారు.
ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా(health insurance)ను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు నెట్వర్క్ హాస్పిటల్స్(network hospitals)కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఆర్థిక పరిమితులతో ఎలాంటి సంబంధం లేకుండా.. ఆధార్ కార్డు(Aadhaar card)లో ఉన్న వయసు ఆధారంగా కుటుంబంలోని వయోవృద్ధులు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం(free treatment) పొందవచ్చు. రాష్ట్రంలోని 1,017 సర్కారు దవాఖానాల్లో కూడా ఈ సేవలను అందుకోవచ్చు. రాష్ట్రంలోని 416 ప్రైవేటు ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ స్కీంతో ఎమ్ ప్యానెల్(M-panels) అయ్యాయి.
ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందడానికి 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మాత్రమే అర్హులు. ఈ కార్డులను పొందాలంటే ముందుగా.. beneficiary.nha. gov.in/ ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ(EKYC) పూర్తి చేయాలి.
ఈ పథకం ద్వారా చికిత్స, శస్త్ర చికిత్సలు, హాస్పిటాలిటీ, ఔషధాల ఖర్చులన్నీ కలిపి రూ.5 లక్షల దాకా ఉచితంగా అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఆయుష్మాన్ వయో వందనకు అర్హులు కావడం గమనార్హం. దీంతోపాటు ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్(private health insurance) ఉన్నవారు కూడా ప్రయోజనం పొందొచ్చు.