అక్షరటుడే, వెబ్డెస్క్: Rajiv Yuva Vikasam | రాజీవ్ యువవికాసం Rajiv Yuva Vikas scheme పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే యువతకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. దరఖాస్తు గడువును ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించింది. గతంలో ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ వరకు అవకాశంగా ఉండగా.. తాజాగా గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Rajiv Yuva Vikasam | ఆఫ్లైన్లోనూ దరఖాస్తుకు అవకాశం
రాజీవ్ యువవికాసం పథకానికి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం government of Telangana అవకాశం కల్పించింది. ఇందుకోసం దరఖాస్తు ఫారాలను ఆన్లైన్లో పొందవచ్చు. లేదా నేరుగా ప్రజాపాలన prajaapalana కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ అధికారులకు MPDO or municipal officials అందించవచ్చు.