అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Parking Fee | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మాల్స్‌లోని పార్కింగ్ ఫీజు(Parking Fee) లపై తాజాగా జీవో విడుదల చేసింది. మాల్స్(Malls)లో మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్ పూర్తిగా ఉచితమని తెలిపింది. 30 నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్ చేసిన వ్యక్తులు మల్టీప్లెక్స్‌లు(Multiplex), మాల్స్‌లో ఏదైనా వస్తువు కొన్నట్లుగా బిల్లులు, సినిమా టికెట్లు చూపిస్తే వారికి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని సూచించింది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ యజమానులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
Parking Fee | ఏపీలో మాల్స్, మల్టీప్లెక్స్‌లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్
Advertisement
Advertisement