Overseas Scholarship | విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి గుడ్​న్యూస్​..!

Overseas Scholarship | విదేశాల్లో చదువుకోవాలనుకునేవారికి గుడ్​న్యూస్​.. ఇలా చేస్తే ప్రభుత్వ సాయం పొందొచ్చు..!
Overseas Scholarship | విదేశాల్లో చదువుకోవాలనుకునేవారికి గుడ్​న్యూస్​.. ఇలా చేస్తే ప్రభుత్వ సాయం పొందొచ్చు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Overseas Scholarship | విదేశీ విద్య అభ్యసించాలనుకుంటున్నారా.. కానీ మీకు అంత స్థోమత లేదా.. ప్రతిభ ఉండి విదేశాల్లో చదువుకునే అవకాశం కోల్పోతున్న వారికోసం ప్రభుత్వం ఈ సదవకాశం కల్పించింది. దీంతో ప్రభుత్వ సహకారంతో మీరు ఎంచక్కా విదేశాల్లో విద్యను అభ్యసించవచ్చు.

Advertisement
Advertisement

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం government ఈ అవకాశం కల్పిస్తోంది. అంబేద్కర్​ ఓవర్సీస్​ విద్యానిధి, చీఫ్​ మినిస్టర్స్​ ఓవర్సీస్​ స్కీం, మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్​ విద్యానిధి పథకాల కింద సహకారం అందించనుంది. ప్రస్తుతం ఎస్సీ వర్గానికి చెందిన వారి నుంచి దరఖాస్తుల applications స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది.

Overseas Scholarship | ఏయే దేశాలకు వెళ్లవచ్చంటే..

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్, సింగపూర్, జపాన్, దేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్, నర్సింగ్, వ్యవసాయ సైన్స్, స్వచ్ఛ సైన్స్, సోషల్‌ సైన్స్‌ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో PG and PhD courses చేరేందుకు వీలుంటుంది. రూ.20లక్షల వరకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.

Overseas Scholarship | ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు

విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మే 19 తుది గడువు ఉంది.  www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి త్వరలో ఈ ప్రక్రియ మొదలు కానుంది.

Overseas Scholarship | అర్హులు వీరే..

  • ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి.
  • డిగ్రీ, ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

Overseas Scholarship | కావాల్సిన ధ్రువపత్రాలు :

  • పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్‌ ధ్రువీకరణ పత్రాలు.
  • ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ.
  • జీఆర్‌ఈ, జీమాట్, టోఫెల్, ఐఎఫ్‌ఎల్‌టీస్‌.
  • యూనివర్సిటీ అనుమతి పొందిన ఎఫ్‌-1 కాపీ.
  • పాస్‌పోర్టు, వీసా.
  • బ్యాంకు అకౌంట్.

Advertisement