అక్షరటుడే, వెబ్డెస్క్: Farmers | ఉల్లి(Onion Crop) సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) శుభావర్త చెప్పింది. ఉల్లి పంట ఎగుమతుల(Exports)పై ఉన్న 20 శాతం సుంకం(Tax) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఉల్లిధరలను నియంత్రించడానికి గతంలో కేంద్రం ఎగుమతులపై సుంకం విధించింది.
ప్రస్తుతం ధరలు(Rates) అదుపులో ఉండటంతో పాటు, మార్కెట్లో ఉల్లి కొరత లేకపోవడంతో కేంద్రం తాజా ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఉల్లి ఎగుమతులు పెరిగి రైతులకు మంచి ధర దక్కే అవకాశం ఉంది. కాగా ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు(Oreders) అమలులోకి రానున్నాయి. కాగా.. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.20 వరకు పలుకుతోంది.