అక్షరటుడే, వెబ్‌డెస్క్ Dwakra Group : ఏ ప్రభుత్వమైనా పురుషుల కంటే కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దానికి కారణం.. మహిళల సాధికారత కోసం. మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి.. ఒకరి మీద ఆధారపడకూడదు అని అన్ని ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళల సాధికారత కోసం ఎంతో కృషి చేస్తోంది. డ్వాక్రా గ్రూపులు, స్వయం సహాయక గ్రూపులు పేరుతో ఎన్నో స్కీమ్ లను తీసుకొచ్చింది.
ప్రతి గ్రామంలోనూ డ్వాక్రా మహిళా సంఘాలు ఉంటాయి. అందులో చేరిన మహిళలకు రుణాలు ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాలను తీర్చుతూ ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో రుణాలను ఇస్తుంటాయి బ్యాంకులు. వాళ్లకు ఉచితంగా బీమా కూడా ఇస్తుంటాయి.
Dwakra Group : కనీసం ఆరు నెలలు గ్రూప్ లో ఉంటే చాలు
డ్వాక్రా గ్రూప్ లో చేరిన మహిళలు కనీసం ఆరు నెలలు ఆ గ్రూప్ లో ఉంటే వాళ్లకు బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు లింకేజ్ లోన్ వచ్చే చాన్స్ ఉంటుంది. కనీసం ఆరు నెలలు ఒక గ్రూప్ ను మెయిన్ టెన్ చేస్తే ఆ గ్రూప్ లో ఉన్న పది మంది మహిళలు.. మరో 5 లక్షల వరకు అదనంగా రుణాన్ని తీసుకోవచ్చు. అంటే.. మరో 50 వేలు అదనంగా వచ్చే చాన్స్ ఉంది.
ఇలా టైమ్ టు టైమ్ రుణాన్ని తీర్చుతూ పోతే రుణ పరిమితి కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే తెలంగాణకు చెందిన మహిళలు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు డ్వాక్రా సంఘాల్లో చేరాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆ డబ్బులతో సొంతంగా ఏదైనా వ్యాపారం కూడా చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ లో అన్ని రకాలుగా అవకాశాలను అందిస్తోంది.