పది పాసై ఆ పనులు వచ్చా.. నెలకు లక్షకు పైగా సాలరీ!

0

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: ఇజ్రాయిల్‌లో నిర్మాణ రంగంలో ఉపాధి కల్పన కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్‌ తెలిపారు. షట్టరింగ్‌ కార్పెంటర్లు, సిరామిక్‌ టైలింగ్‌, ప్లాస్టరింగ్‌, ఐరన్‌ బెండింగ్ లో మూడేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. లక్షా 20వేల నుంచి రూ. లక్షా 38 వేల వరకు వేతనం వస్తుందన్నారు. ఆసక్తి గల వారు మార్చి 16వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. వీరికి మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు స్కిల్‌ టెస్ట్‌ ఉందని పేర్కొన్నారు.