Google Play Store : ఈ 300 యాప్స్ చాలా డేంజర్.. మీ ఫోన్‌లో ఉన్నాయో చెక్ చేసుకోండి.. ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్

Google Play Store : ఈ 300 యాప్స్ చాలా డేంజర్.. మీ ఫోన్‌లో ఉన్నాయో చెక్ చేసుకోండి.. ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్
Google Play Store : ఈ 300 యాప్స్ చాలా డేంజర్.. మీ ఫోన్‌లో ఉన్నాయో చెక్ చేసుకోండి.. ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Google Play Store : మీరు స్మార్ట్‌ఫోన్ (Smartphone) వాడుతున్నారా? అది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనా? అయితే మీ డేటా లీక్ అయి ఉండొచ్చు. మీరు కనుక ఈ 300 యాప్స్ (300 apps)లో ఏదో ఒక యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని ఉన్నా మీ డేటా మొత్తం ఆ Apps యాప్స్ నిర్వాహకుల చేతికి వెళ్లినట్టే.

Advertisement

ఇలా కస్టమర్ల డేటాను దొంగలిస్తున్న దాదాపు (300 apps)300 ఆండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 ఓఎస్ అనేది అప్ డేటెడ్ వర్షన్. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు చాలామంది ఆండ్రాయిడ్ 13కి అప్ డేట్ చేసుకున్నారు.

అయితే..ఆండ్రాయిడ్ 13 ఓఎస్ సిస్టమ్ సెక్యూరిటీ రూల్స్ ‌ను బ్రేక్ చేసి మరీ కస్టమర్ల డేటాను ఆ యాప్స్ దొంగలిస్తున్నట్టు గుర్తించారు. ఆ డేంజరస్ 300 యాప్స్ ను కనీసం 6 కోట్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారట. ఒకవేళ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (Smartphone)స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న వాళ్లు వెంటనే లేటెస్ట్ వర్షన్ కు అప్ డేట్ చేసుకుంటే ఓకే కానీ, చాలామంది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ లేటెస్ట్ వర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం లేదు. అటువంటి వాళ్లు కనుక ఈ డేంజరస్ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకొని ఉంటే మాత్రం వాళ్ల డేటా ప్రమాదంలో పడినట్టే లెక్క.

Google Play Store : యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త

ఎవరైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా డేంజర్ యాప్స్ ఎప్పటికప్పుడు గూగుల్ ప్లే స్టోర్ Google Play Store లోకి వస్తుంటాయి. వాటిని తొందరపడి ఇన్ స్టాల్ చేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే, ఒక యాప్ డౌన్ లోడ్ చేసే ముందు కచ్చితంగా యాప్ కు సంబంధించిన అన్ని డిటెయిల్స్ చెక్ చేసుకోవాలి. రివ్యూస్, ఎంత మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. యాప్స్ పర్మిషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. గూగుల్ కూడా ఎప్పటికప్పుడు యాప్స్ ను చెక్ చేస్తూ ఏమాత్రం సెక్యూరిటీ రూల్స్ బ్రేక్ చేసినా వెంటనే వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తుంది.

Advertisement