Gopichand : టాలెంటెడ్ డైరెక్టర్‌తో గోపీచంద్ మూవీ.. ఈసారి పక్కా హిట్ టార్గెట్ తో వస్తున్నాడా..?

Gopichand : టాలెంటెడ్ డైరెక్టర్ తో గోపీచంద్ మూవీ.. ఈసారి పక్కా హిట్ టార్గెట్ తో వస్తున్నాడా..?
Gopichand : టాలెంటెడ్ డైరెక్టర్ తో గోపీచంద్ మూవీ.. ఈసారి పక్కా హిట్ టార్గెట్ తో వస్తున్నాడా..?
Advertisement

Gopichand : మ్యాచో హీరో గోపీచంద్ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్నాడు. చివరగా వచ్చిన భీమా కూడా ఆకట్టుకోలేదు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా గోపీచంద్ ప్రయత్నాలైతే చేస్తూనే ఉన్నాడు. ఇక లేటెస్ట్ గా గోపీచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుంది. ఘాజి, అంతరిక్షం సినిమాలతో తన ప్రతిభ చాటుకున్న ఈ డైరెక్టర్ ఈసారి గోపీచంద్ తో మరో అటెంప్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. గోపీచంద్ ఒక మంచి మాస్ హీరో కానీ ఆయన ఈమధ్య ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేఅపోతున్నాడు. ఐతే ఫలితాలు ఎలా ఉన్నా ఆడియన్స్ కు ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతో సినిమాలు చేస్తున్నాడు గోపీచంద్. అందుకే కొత్త సినిమాను సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే మంచి బజ్ ఏర్పడింది.

Gopichand : సంకల్ప్ సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా..

సంకల్ప్ సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా ఉంటాయి. తెలుగులో మొదటి సబ్ మెరైన్ సినిమా ఘాజి సినిమా తీసి సర్ ప్రైజ్ చేశాడు సంకల్ప్ రెడ్డి. మరి అలాంటి డైరెక్టర్ గోపీచంద్ లాంటి మాస్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గోపీచంద్ లోని మాస్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం హ్యూజ్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  హిట్టు సినిమా క్లైమాక్స్ మారిస్తే కానీ కొనమని చెప్పిన ఓటీటీ సంస్థ.. ఎందుకలా..?

గోపీచంద్ ఫ్యాన్స్ కూడా అతని కంబ్యాక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబో ఎలాంటి సినిమా చేస్తున్నారు. ఈ కలయికలో వచ్చే సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. గోపీచంద్ కి కరెక్ట్ హిట్ సినిమా పడితే అతను తిరిగి ఫాం లోకి వస్తాడు. సినిమాలు ఫ్లాపులు అవుతున్నా గోపీచంద్ కాన్ ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సంకల్ప్ సినిమాతో అయినా గోపీచంద్ అనుకుంటున్న సక్సెస్ వస్తుందేమో చూడాలి.

Advertisement