అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని కోజా కాలనీలో ప్రైమ్ స్కూల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీ రిజర్వేషన్ల కోసం కృషి చేసిన షబ్బీర్ అలీని డాక్టర్ లుక్మాన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న నాలుగు శాతం మైనారిటీ రిజర్వేషన్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. మైనారిటీలకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యతిస్తుందని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన విషయం గుర్తు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.