అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajiv Yuva Vikasam | రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత ఏప్రిల్ 5 వరకే దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అయితే ప్రజల నుంచి వస్తున్న వినతుల మేరకు ఏప్రిల్ 14 వరకు గడువు పెంచినట్లు డిప్యూటీ సీఎం(Deputy CM) భట్టి విక్రమార్క(Bhati Vikramarka) తెలిపారు.
దరఖాస్తు చేసుకునే సమయంలో రేషన్‌కార్డు(Ration Card) ఉన్నవారికి ఆదాయ ధృవీకరణ పత్రం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు రాయితీపై రుణాలు ఇవ్వనున్నారు. పథకం కోసం ఇప్పటికే లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.