gig workers | గిగ్ వర్కర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

gig workers | గిగ్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త.. వారి భద్రత కోసం త్వరలో బిల్లు
gig workers | గిగ్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త.. వారి భద్రత కోసం త్వరలో బిల్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: gig workers | గిగ్ వర్కర్లకు gig workers in Telangana రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయం నిమిత్తం అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy ఆదేశించారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలన్నారు. ఈ మేరకు గిగ్ వర్కర్లు gig workers, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల various departments ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు.

Advertisement
Advertisement

gig workers | సీఎంకు వివరించిన అధికారులు

గిగ్ వర్కర్లకు gig workers ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం insurance facilities, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ రూపొందించిన ముసాయిదాపై సీఎంకు అధికారులు వివరించారు. “తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ బిల్లు”లో telanagana gig workers bill పొందుపర్చిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. ముసాయిదాలో సీఎం రేవంత్​ CM Revanth పలు మార్పులు చేర్పులను సూచించారు.

gig workers | కొత్త చట్టం అందరికీ ఆమోద యోగ్యంగా ఉండాలి

కొత్త చట్టం అందరికీ ఆమోద యోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి Chief Minister తెలిపారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా చట్టం ఉండాలన్నారు. బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Bhu Bharati | రైతుల పాలిట శాపం ‘ధరణి’

gig workers | 25వ తేదీ నాటికి ముసాయిదా సిద్ధం చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ food delivery, క్యాబ్స్ డ్రైవర్లు cab drivers, ప్యాకేజ్ డెలివరీల్లో package deliveries దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై తుది కసరత్తు చేయాలన్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని ఆదేశించారు.

gig workers | మే డే రోజు బిల్లు అమల్లోకి వచ్చేలా చూడాలి

నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన International Workers’ Day మే డే రోజు బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ Ponnam Prabhakar, పొంగులేటి శ్రీనివాసరెడ్డి Ponguleti Srinivasa Reddy, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి Shanthikumari, అధికారులు పాల్గొన్నారు.

Advertisement