అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. డీఏపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు సీఎంవో అధికారిక ప్రకటన చేసింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ చర్చ జరిపారు. డీఏపై నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే వివిధ సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల నేతృత్వంలోని కమిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దారి చూపుతుందని వెల్లడించారు. అలాగే అత్యంత కీలకమైన 317 జీవోపై మంత్రి వర్గ ఉప సంఘం ఇప్పటికే సమర్పించిన నివేదికపై త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.