అక్షరటుడే, వెబ్డెస్క్ : Assembly | తెలంగాణ బడ్జెట్(Budget) సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వం ఐదు కీలక బిల్లులు(Bills) ప్రవేశపెట్టింది. బీసీ రిజర్వేషన్లకు(BC Reservations) సంబంధించిన రెండు బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒక బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మరో బిల్లు సభ ముందుకు తెచ్చారు.
Assembly | ఎస్సీ వర్గీకరణకు..
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ(SC Classification) అంశానికి సంబంధించిన బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే పొట్టిశ్రీరాములు వర్సిటీ చట్ట సవరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును తెలంగాణ కవి సురవరం ప్రతాప్రెడ్డిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. అలాగే టీటీడీ(TTD) తరహాలో యాదగిరి గుట్ట బోర్డు(Yadagiri Gutta Board) ఏర్పాటుకు సంబంధించి చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం సభలో పెట్టింది. కాగా ఆయా బిల్లులపై స్పీకర్ చర్చకు అవకాశం కల్పించనున్నారు.