అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ration Cards |పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ నాయకులు(Congress leaders) అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.
రాష్ట్ర జనాభా(state population)లో 85 శాతం మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్న బియ్యం(Thin rice) పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ కురుమ సాయిబాబా, ప్రశాంత్ గౌడ్, వినోద్ గౌడ్, పప్పు వెంకటేశం, విద్యాసాగర్, సామెల్ ,శ్రీనివాస్, గోపి, శకావత్ తదితర నాయకులు పాల్గొన్నారు.