అక్షరటుడే, వెబ్‌డెస్క్: Registrations | పేద, మధ్య తరగతి వారు రూపాయి రూపాయి కూడా బెట్టి పట్టణాల్లో ప్లాట్లు(Plots) కొంటారు. అయితే కొందరు వ్యక్తులు ఒకే ప్లాట్‌ను open plots పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడుతుంటారు. ఇలా మోసాపోయిన ఎంతో మంది కష్టపడి కొన్న ప్లాట్ తమకు దక్కకుండా పోయిందని మనోవేదన చెందుతున్నారు. నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట డబుల్ రిజిస్ట్రేషన్ double registration fraud జరిగిందనే ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. అయితే చాలా మంది మధ్య తరగతి వారు.. వారితో పోరాడలేక డబ్బులు వదులుకుంటున్నారు.
ఇలాంటి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం telanagana stamps and registrations department సంచలన నిర్ణయం తీసుకుంది. డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం చట్ట సవరణ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి minister ponguleti srinivas reddy తెలిపారు. రిజిస్ట్రేషన్ చట్టంలో registration act కొత్తగా సెక్షన్ 22కి సవరణ చేస్తూ సెక్షన్ 22-బి తీసుకు వస్తామన్నారు. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్ జరగదన్నారు.
Registrations | పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్
రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్(Sub-Registrar) కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు సమర్థవంతంగా, వేగవంతంగా మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ sub registrar office కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ 10 నుంచి 15 నిమిషాలలోనే పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్(Slot Booking) విధానాన్ని తీసుకు వస్తామన్నారు. మొదట ఈ నెల 10 నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెడుతామన్నారు. ప్రజలు తమకు నచ్చిన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
Registrations | సిబ్బందిని నియమిస్తాం..
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనిపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తాన్నారు. మొదట మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.