అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లతో ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ల ఆట కట్టించడానికి ఇప్పటికే తెలంగాణ పోలీసులు(Telangana Police) కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బెట్టింగ్ యాప్‌ల(Betting App) వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడారు. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై విచారణకు సిట్ (SIT)ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
CM Revanth Reddy | చట్టం అమలు కాకపోవడంతో..
ప్రభుత్వం 2017 లో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించినా.. పకడ్బందీగా అమలు కాలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీంతోనే ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై, ఆన్లైన్ రమ్మీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. దీని కోసం సీబీసీఐడీ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
CM Revanth Reddy | వారిపై కేసులతో సమస్య తీరదు
బెట్టింగ్ యాప్‌ల విషయంలో రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల ప్రమోయం ఉందన్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించామన్నారు. దీంతో సమస్య తీరదని సీఎం పేర్కొన్నారు. దీంతో సిట్ ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్‌ల నియంత్రణకు చర్యలు చేపడుతామన్నారు. గతంలో చేసిన చట్టంలో శిక్షలు తక్కువగా ఉన్నాయని, వాటిని సవరిస్తామని సీఎం తెలిపారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, ప్రమోట్ చేసిన వారు, ఇంకా దీని వెనకల ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.