అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Mla | రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మదన్ మోహన్(Mla madhan mohan) అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme) ద్వారా మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడ్డానికి ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు, బీమా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాలు మహిళల సాధికారికతకు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసీ ఛైర్మన్ రజిత, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల నాయకులు పాల్గొన్నారు.
Yellareddy Mla | మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత : ఎమ్మెల్యే
Advertisement
Advertisement