అక్షరటుడే, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లాలోని రహదారి వెంబడి ఉన్న దాబా హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. బిచ్కుంద మండలంలోని జాతీయ రహదారి 161 రహదారి పక్కన గల దాబా హోటల్ యాజమాన్యాలకు గురువారం మండల పంచాయతీ అధికారి అబ్బాగౌడ్ నోటీసులు అందజేశారు. జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా భారీ వాహనాలు నిలుపకుండా ఉండేందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట జాతీయ రహదారి ఐఎంఎస్ మేనేజర్ మొయినుద్దీన్, పంచాయతీ కార్యదర్శి రాజు ఉన్నారు.