
Wedding Function : ఆంధ్రా మర్యాదలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటికి అతిథి వస్తే వారి కడుపు నింపనిది పంపరు. అల్లుళ్లు వస్తే ఇంక ఆ మర్యాదలు వేరే లెవల్. వీలైనన్ని వంటకాలు వారికి చేసి పెట్టాలి. మామూలుగా ఇది ఆంధ్రప్రదేశ్‌లోని సంస్కృతి. పండక్కి వచ్చిన కొత్త అల్లుళ్లకు వందల రకాల వంటకాలు చేసి వడ్డించి సకల మర్యాదలు చేయడం కామన్‌గా మారింది. అయితే ఇప్పుడు అల్లుళ్లకే కాదు.. పెళ్లికి వచ్చిన అతిథులకి కూడా వెరైటీ వంటకాలు వడ్డిస్తూ వారి కడుపు ఉబ్బిపోయేలా చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది.
Wedding Function : ఇదేం ఆచారమో..
ఈ వీడియోలో ఏముంది అంటే ఓ ఫంక్షన్‌లో అందరికి మంచిగా విస్తరాకులు వేసి వరుసగా కూర్చోపెట్టారు. ఇక ఫంక్షన్‌కి వచ్చిన అతిథుల కోసం వెరైటీ స్వీట్స్ వడ్డిస్తున్నారు. ఇన్ని స్వీట్స్ ఎలా తింటారు బాబు అని చూసిన వాళ్లు ముచ్చటించుకుంటున్నారు. స్వీట్స్ తింటే అసలు అన్నం తినగలమా అని కూడా కొందరు ముచ్చటించుకుంటున్నారు. అయితే ఈ వీడియోలో స్వీట్స్ వడ్డించడం మాత్రమే కనిపిస్తుంది. స్వీట్సే ఇన్ని రకాలు వడ్డిస్తే భోజనంలో ఇంకా ఎన్ని వెరైటీ కూరలు వడ్డించారో కదా అని ముచ్చటించుకుంటున్నారు.
ఇది ఎక్కడ జరిగిందో కాని ప్రస్తుతం వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. జిలేబి, జాంగ్రీ, మైసూర్ పాక్, కలాకందా, పాలకోవా, సేమియా పాయసం ఇలా రకరకాల నోరూరించే స్వీట్లతో పాటు, హాట్ వంటకాలను వారు వడ్డించినట్టు తెలుస్తుందతి.. రకరకాల బిర్యానీలు, వివిధ రకాల పళ్లు ఇలా మొత్తం కలిపి చాలా రకాలతోనే విందు భోజనానికి సిద్ధం చేశారు. బంధువులతో పాటు చుట్టుపక్కల మహిళలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది.
మా ఆంధ్రా style ఆయ్ 😀😀
మీ దుంపలుతెగ, అన్నం ఎప్పుడు పెడతార్రా! మీ మర్యాదలు మీరు తగలేయ్యా ! 🫢🫢 తాతగారి inner feeling 🤣🤣 pic.twitter.com/s1hfh0GqIA
— Geetha vijaya ™️ 😍✌️ (@geetha_happy2) March 8, 2025