అక్షర టుడే, ఎల్లారెడ్డి: MLA Madanmohan Rao | నియోజకవర్గంలో 22వ ప్యాకేజీ పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు కోరారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో Assembly meetings ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి YS rajasheker Reddy హయాంలో ప్రారంభించిన 22వ ప్యాకేజీ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. త్వరగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే, సదాశినగర్, గాంధారి, తాడ్వాయి, లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల్లో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాటేవాడి, మోతే గ్రామాల్లో కొత్త రిజర్వాయర్లు Reserviours నిర్మించుకోవచ్చని, గాంధారి మండలంలో సాగునీటితోపాటు తాగునీటికి ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయన్నారు.
MLA Madanmohan Rao | 22 ప్యాకేజీ పనులకు నిధులు మంజూరు చేయండి
Advertisement
Advertisement