Advertisement
అక్షర టుడే, నిజాంసాగర్: Pitlam | పిట్లం మండలం అల్లాపూర్‌లో డా బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం భూమిపూజ చేశారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గైని పోచయ్య ఆధ్వర్యంలో దళిత నాయకులు, గ్రామస్థులు పాల్గొని పనులు ప్రారంభించారు. దేశానికి అత్యున్నత రాజ్యాంగం అందించిన మహనీయుడు అంబేద్కర్ అని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రాములు, కార్యదర్శి రాజు, సంయుక్త కార్యదర్శి సాయిరాం, శ్రీకాంత్, నాగయ్య, లింగయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement