అక్షరటుడే, హైదరాబాద్: GROUP-1 RESULTS | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ లాగిన్‌లో మార్కులను చూసుకునే అవకాశాన్ని టీఎస్పీఎస్సీ కల్పించింది.
గ్రూప్–1లో 563 పోస్టులకు గాను గతేడాది అక్టోబర్‌లో పరీక్షలు జరిగాయి. మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్ ఫైనల్ ఎగ్జామినేషన్ చేస్తుంది. సోమవారం గ్రూప్–2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్–3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నారు.
GROUP-1 RESULTS | గతేడాది మెయిన్స్ పరీక్ష నిర్వహణ
తెలంగాణ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
GROUP-1 RESULTS | పరీక్షలకు బయోమెట్రిక్ విధానం..
2011 తర్వాత గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసింది. దీని కోసం పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేకంగా సిబ్బంది నియమించింది. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కేంద్రాల చుట్టూ సీసీ కెమెరాలు అమర్చారు.