అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ ఆఫీసు గోడలు, గేట్లకు గ్రూప్- 1 పోస్టర్లు కలకలం రేపాయి. గ్రూప్- 1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ.. సిగ్గు సిగ్గు అని పోస్టర్లలో పేర్కొన్నారు. కమిషన్ తప్పులతో నిరుద్యోగులు ఎన్ని తిప్పలు పడాలో అంటూ మరో పోస్టర్‌లో పేర్కొన్నారు. “టీజీపీఎస్సీ అను నేను ఒక నియంతను.. నేను తప్పు అంటే తప్పు.. నేను ఒప్పు అంటే ఒప్పు” అని మరొక పోస్టర్‌ను అతికించడం కలకలం రేపింది.
Advertisement
Advertisement