GROUP-1 గ్రూప్​–1 ఫలితాల విడుదల
GROUP-1 గ్రూప్​–1 ఫలితాల విడుదల
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: GROUP-1 | టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్​–1 మెయిన్స్​ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను టీజీపీఎస్సీ వైబ్​సైట్​లో పొందుపర్చారు. మొత్తం 563 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్​ జారీ చేసిన విషయం విదితమే. పరీక్షలు గతేడాది అక్టోబర్​ 21వ తేదీ నుంచి​ 27 వరకు నిర్వహించారు. ప్రిలిమ్స్​లో 31,383 మంది అర్హత సాధించినప్పటికీ.. మెయిన్స్​కు 21,093 మంది హాజరయ్యారు.

15 రోజుల్లోగా రీకౌంటింగ్​కు అవకాశం..

గ్రూప్​ అభ్యర్థులు మార్కులను ప్రకటించిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ..15 రోజుల్లోగా రూ.1,000 చెల్లించి రీకౌంటింగ్​కు అవకాశం కల్పించారు. ఇందుకోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లెక్కింపులో పొరపాట్లు జరిగినట్లయితే.. సరిచేసిన తర్వాత మెరిట్​ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది.

Advertisement