TGPSC | 10న గ్రూప్‌-1 ఫ‌లితాల విడుద‌ల‌

TGPSC | 10న గ్రూప్‌-1 ఫ‌లితాల విడుద‌ల‌
TGPSC | 10న గ్రూప్‌-1 ఫ‌లితాల విడుద‌ల‌
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌: TGPSC | తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ గ్రూప్స్​ ఫలితాల విడుదలకు షెడ్యూల్​ ప్రకటించింది. ఈనెల 10 నుంచి 18వ తేదీ లోపు గ్రూప్స్​–1, 2, 3 ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 563 గ్రూప్​–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్​ జాబితా వెల్లడించేందుకు టీజీపీఎస్సీ పరిశీలన చేస్తోంది.

TGPSC | షెడ్యూల్​ ఇదే..

మార్చి 10న గ్రూప్​–1 ఫలితాలను విడుదల చేయనున్నారు. అదేరోజు అభ్యర్థుల ప్రొవిజినల్​ మార్కుల వివరాలను వెల్లడించనున్నారు. అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన టీజీపీఎస్సీ నిర్వహించనుంది. మార్చి 11న గ్రూప్​–2 జనరల్​ ర్యాంకింగ్​ జాబితాను ప్రకటించనుంది. 14న గ్రూప్​–3 జనరల్​ ర్యాంకుల జాబితా విడుదల చేయనుంది. 17న హాస్టల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​, 19న ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్​ తుది ఫలితాలు అధికారులు వెల్లడించనున్నారు.

Advertisement