ప్రస్తుతం ఐపీఎల్ IPL హంగామా ఓ రేంజ్‌లో సాగుతుంది. ప్రతి జట్టు కూడా కసిగా ఆడుతుంది. ఒకసారి ఓడింది అంటే తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించి తీరాలి అనేలా ఆడుతున్నారు. గత రాత్రి గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ Mumai indians జట్లు మధ్య మ్యాచ్ జరగగా, ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. Ahmedabad అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, రెండు మాజీ ఛాంపియన్ జట్ల మధ్య ఉత్కంఠ పోటీ కనిపించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసింది. చెత్త ప్రారంభం తర్వాత, చివరి ఓవర్లలో ముంబై జట్టు బలమైన పునరాగమనం చేసింది.
ఇది కారణం..
వరుసగా మూడు బంతుల్లో 3 వికెట్లు పడగొట్టింది. కానీ, ఏ బౌలర్ కూడా హ్యాట్రిక్ సాధించలేదు. వివరాలలోకి వెళితే సొంత మైదానం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బలమైన ఆరంభాన్ని సాధించింది. కెప్టెన్ శుభమాన్ గిల్ (Shubhman Gill) సాయి సుదర్శన్ Sai Sudarshan అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, గిల్ ఔట్ అయిన తర్వాత, జోస్ బట్లర్ కూడా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 18వ ఓవర్ సమయానికి గుజరాత్ 179 పరుగులు చేసి కేవలం 4 వికెట్లు మాత్రమే పడిపోయాయి. గుజరాత్ జట్టు 200 పరుగులు అవలీలగా సాధిస్తుందని అందరు అనుకున్నారు. కాని క్రమంగా వికెట్ల పతనం సాగింది. ముంబై ఇండియన్స్ వరుసగా 3 బంతుల్లో ముగ్గురు గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపింది.
కానీ ఏ బౌలర్ ఖాతాలో హ్యాట్రిక్ పడలేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే ఈ 3 వికెట్లు రెండు వేర్వేరు ఓవర్లలో పడడం కాగా, రెండవది, వీటిలో ఒకటి రనౌట్ కూడా ఉంది. 18వ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన చివరి బంతికి సాయి సుదర్శన్ క్యాచ్ అవుట్ గా పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత 19వ ఓవర్ తొలి బంతికే కొత్త బ్యాట్స్‌మన్ రాహుల్ తెవాటియా రనౌట్ అయి నిరాశగా డగౌట్ చేరాడు. ఇక అదే ఓవర్ రెండో బంతికి షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు దీపక్ చాహర్ Deepak Chahar ఓవర్‌లోనే వచ్చాయి. ఈ విధంగా, గుజరాత్ కేవలం 179 పరుగుల స్కోరు వద్ద వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయింది. దాంతో హ్యాట్రిక్ రాలేదు.