GT vs MI, IPL – 2025 | గుజరాత్​ చేతిలో చిత్తుగా ఓడిన ముంబై జట్టు

GT vs MI, IPL - 2025 | గుజరాత్​ చేతిలో చిత్తుగా ఓడిన ముంబై జట్టు
GT vs MI, IPL - 2025 | గుజరాత్​ చేతిలో చిత్తుగా ఓడిన ముంబై జట్టు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GT vs MI, IPL – 2025 : ఐపీఎల్​ 2025లో భాగంగా 9వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా సాగిన ఈ మ్యాచ్​లో 36 పరుగుల తేడాతో గుజరాత్​ టైటాన్స్ జట్టు విజయం సాధించింది.

Advertisement
Advertisement

టాస్ ఓడిన శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బాల్ ను ఎక్కువగా బౌండరీలు దాటించలేకపోయారు కానీ, సింగిల్స్, డబుల్స్ ను వదిలి పెట్టకుండా తీశారు. బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ (63) టాప్ స్కోర్​ చేశాడు.

గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38 పరుగులు) చక్కని ఆట తీరు ప్రదర్శించాడు. 78 పరుగుల వరకు ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా ఆడారు. గిల్ ఔట్ అయ్యాక వచ్చిన జోస్ బట్లర్‌(39) దూకుడు చూపాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  IPL 2025 : ఆరో స్థానంలో వ‌చ్చి ఊచ‌కోత‌.. ఐపీఎల్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన మ‌రో ఆట‌గాడు

ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్​ బౌల్ట్, దీపక్​ చాహర్​, ముజీబుర్​ రహమాన్​, సత్యనారాయణ రాజు ఒక్కో వికెట్​ తీశారు.

ముంబై బ్యాటర్లు పేలవ ఆట తీరును ప్రదర్శించారు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగారు. 15 ఓవర్లకే ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి ఖరారు అయింది. 197 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు తొలి ఓవర్​లోనే షాక్​ తగిలింది. రోహిత్​ శర్మ ఔట్​ అయ్యాడు. అంతకు ముందు నాలుగు బాల్స్ ఆడి రెండు ఫోర్లు కొట్టాడు. తిలక్​ వర్మ 39 పరుగులు చేసి రాహుల్​ తెవాతియాకు క్యాచ్​ ఇచ్చాడు.

రాబిన్​ మింజ్​(3) రాణించలేకపోయాడు. సూర్యకుమార్​ యాదవ్​ (48), హార్దిక్​ పాండ్యా(11) కూడా క్యాచ్​ ఔట్​ అయ్యారు.

Advertisement