అక్షరటుడే, వెబ్ డెస్క్ Post Office Scheme : ఇండియా పోస్ట్ ఆఫీస్ (Post Office) అనేక రకాల పొదుపు పథకాలను నిర్వహిస్తుండగా, ఇవి ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. (Post Office Schemes)పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టి లక్షలాది మంది మంచి రాబడులు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోస్టాఫీసులో (Post Office) డబ్బు పెట్టుబడి పెట్టడం రిస్క్ ఫ్రీగా పరిగణిస్తూ పొదుపు చేస్తుంటారు. అయితే రోజూ రూ.50 పెడితే రూ.35 లక్షలు పథకం గురించి మీకు ఐడియా ఉందా. ఈ పథకం పేరు గ్రామ సురక్షా యోజన పథకం. దీన్ని (Post Office) పోస్టాఫీస్ నిర్వహిస్తోంది. మీకు దగ్గర్లోని పోస్టాఫీస్‌కి వెళ్లి.. ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో రోజూ రూ.50 పెట్టుబడి పెడితే.. రూ.35 లక్షల వరకు రిటర్న్ పొందవచ్చు.
Post Office Scheme : ఆలస్యం ఎందుకు?
ఈ పథకం ద్వారా, రిటైర్మెంట్ తర్వాత వృద్ధులకు బెనిఫిట్ అందుతుంది. పాలసీ వ్యవధిలోపు పాలసీదారు మరణిస్తే, నామినీలు పాలసీ కింద వచ్చే మొత్తాన్ని పొందవచ్చు. ఈ పథకంలో చేరి, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ప్లాన్‌ను ఎండోమెంట్ హామీ ప్లాన్‌గా మార్చవచ్చు. మీకు దగ్గర్లోని (Post Office) పోస్టాఫీస్‌కి వెళ్లి, ఈ పథకంలో చేరవచ్చు. 19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి. ఈ స్కీమ్ Schemeను ప్రారంభించిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు స్వచ్ఛందంగా దీన్ని నిలిపేయవచ్చు.
ఈ స్కీమ్‌లో బోనస్ కూడా ఉంటుంది. అంటే.. మీరు డిపాజిట్ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు సంవత్సరానికి రూ.60 బోనస్ వస్తుంది. ఈ పథకంలో చేరిన వారు రోజుకు రూ. 50 డిపాజిట్ చేయగలిగితే దీని ప్రకారం మీ డిపాజిట్ మొత్తం ఒక నెలలో రూ. 1500 అవుతుంది. సంవత్సరంలో రూ. 18 వేలు అవుతుంది. అలానే ఒక వ్యక్తి 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసువారైతే మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షల 48 వేలు అవుతుంది. మెచ్యూరిటీ Maturity గడువు ముగిసే సమయానికి ఇదే రూ. 30 నుంచి రూ.35 లక్షల వరకు జమ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ పథకంలో చేరండి.