అక్షరటుడే, ఎల్లారెడ్డి: అడ్విలింగాల్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి గ్రామానికి చెందిన గుడిపల్లి సంగమేశ్వర్ రెడ్డి విరాళం అందజేశారు. తన తల్లిదండ్రులు గుడిపల్లి శశికళ బాల్ రెడ్డి జ్ఞాపకార్థం రూ.50 వేలు అందించారు. ఈ సందర్భంగా సంగమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్ కోసం విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు చదువుతో అన్ని రంగాల్లో రాణించాలని.. నా సహాయం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, విజయ్, మహేందర్ గౌడ్, సిద్దిరామగౌడ్ పాల్గొన్నారు.