అక్షర టుడే, బోధన్: ప్రమాదవశాత్తు కాలు జారి నీటికుంటలో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాకాసిపేట్ ప్రాంతానికి చెందిన గుండ్ల నర్సింలు(40) మద్యం మత్తులో తన ఇంటికి సమీపంలోని కర్ణం నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.