Advertisement
అక్షరటుడే, ఇందూరు: భారతీయ వాయుసేన ఆధ్వర్యంలో అగ్నివీర్ వాయు ఉద్యోగానికి పెళ్లి కానీ యువతీయువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వింగ్ కమాండర్ గురుప్రీత్ అత్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 7 నుంచి 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో (https://agnipathvayu.CDAC.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2005 జనవరి 1 నుంచి 2008 జూలై 1వ తేదీ లోపు జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇంటర్‌లో 50 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు. ఆన్‌లైన్ పరీక్ష మార్చి 22న ఉంటుందని తెలిపారు.
Advertisement