అక్షరటుడే, ఇందూరు: నగరంలోని గాజుల్‌పేట్‌లో గల గురుద్వారాలో గురునానక్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సంకీర్తన, గురు గ్రంథ పఠనం కొనసాగుతుంది. సాయంత్రం గురుద్వారా నుంచి పెద్ద బజార్, నెహ్రూ పార్క్ అహ్మదీబజార్ మీదుగా శోభాయాత్ర ఉంటుందని పూజారి సర్దార్ సోహన్ సింగ్ తెలిపారు.