అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maharashtra | గుబురుగా ఉన్న జుట్టు ఉన్నట్టుండి కుప్పలుగా రాలిపోవడమేంటి.. పొడవాటి గోళ్లు ఉన్నఫలంగా ఊడిపోవడమేంటి.. ఆ గ్రామాల్లో ఇప్పుడిదే మిస్టరీగా మారింది. డాక్టర్లకు doctors కూడా అంతుబట్టని సమస్య ఆ గ్రామాల ప్రజలను వేధిస్తోంది.
మహారాష్ట్రలోని Maharashtra బుల్ఢాణా జిల్లాలో Buldhana district కొన్ని గ్రామాలను వరుస సమస్యలు భయపెడుతున్నాయి. శరీరంలో ఏ క్షణం ఎలాంటి మార్పు జరుగుతుందో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల ఉన్నట్టుండి వందలాది మందికి ఆకస్మాత్తుగా జుట్టు ఊడిపోయిన భయానక ఘటన horrific incident మరవక ముందే ఇప్పుడు మరో సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడి ప్రజలు గోళ్ల సమస్యలతో nail problems తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బుల్ఢాణా జిల్లాలోని Buldhana district నాలుగు గ్రామాల ప్రజలకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. గోళ్లు ముడతలు పడటం, ఊడిపోవడం వంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు facing problems. చిన్నపిల్లల young children నుంచి ముసలివాళ్ల వరకు ఎంతో మంది ఈ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో, తమకు వచ్చిన సమస్య ఏంటో తెలియక ఆస్పత్రులకు hospitals జనాలు క్యూ కడుతున్నారు.
రంగంలోకి దిగిన డాక్టర్లు doctor సమస్యను problem గుర్తించే పనిలో పడ్డారు. అందరికీ వైద్య పరీక్షలు medical tests చేపడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా, శరీరంలో సెలీనియం స్థాయిలు selenium levels పెరగడమే ఈ సమస్యకు కారణంగా వైద్యులు భావిస్తున్నారు.
జుట్టు కోల్పోయిన విషయంలో కొన్ని రోజుల క్రితం ఈ పల్లెలే దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. అప్పటివరకు ఒత్తుగా ఉన్న జట్టు ఒక్కసారిగా రాలిపోవడంతో ప్రజలంతా భయకంపితులయ్యారు. వికార అవతారంతో ugly appearance బయటకు కూడా వెళ్లలేకపోయారు. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ల వరకు అందరిదీ ఇదే సమస్య same problem. యువత ఉద్యోగాలకు jobs, విద్యార్థులు students కాలేజీలకు వెళ్లడం మానేసి.. హాస్పిటల్స్ hospital చుట్టూ తిరిగారు. కాగా, సెలీనియం లెవల్స్ పెరగడమే జుట్టు ఊడిపోవడానికి కారణమని వైద్యులు తేల్చారు. ఇప్పుడు కూడా ఇదే కారణంగా భావిస్తున్నారు.