అక్షరటుడే, వెబ్డెస్క్ : Schools | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట(Half day Schools) బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట వరకు పనిచేయనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాల్సి ఉంటుంది. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాల్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహించనున్నారు.