Schools | 15 నుంచి ఒంటిపూట బడులు

Schools | 15 నుంచి ఒంటిపూట బడులు
Schools | 15 నుంచి ఒంటిపూట బడులు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Schools | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

Schools | వారికి మాత్రం మధ్యాహ్నం

రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్​ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాల్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహించనున్నారు. మిగతా తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి పాఠాలు చెప్పనున్నారు. ఏప్రిల్​ 23 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Kukatpally | మంచి నీళ్లు అడిగి.. చైన్​ చోరీ

కాగా.. మార్చి ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. పలు చోట్ల రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.

Advertisement