అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ గురువారం సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మాత్రమే కొనసాగుతాయి. పదో తరగతి సెంటర్లు ఉన్న బడులు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనున్నాయి.