అక్షరటుడే, హైదరాబాద్: Mujra party : మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి(Moinabad police station)లో నిర్వహించిన ముజ్రా పార్టీని mujra dance పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ పోలీస్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు(SoT police)దాడులు చేపట్టారు. ఏతబర్ పల్లి గ్రామ(Ethaber Palli village) శివారులోని హాలీడే ఫామ్ హౌస్(farmhouse) లో పుట్టినరోజు వేడుకల (birthday celebrations) సందర్భంగా ముజ్రా పార్టీ నిర్వహించారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై (Mumbai) నుంచి యువతులను ఇక్కడికి రప్పించాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా ఉన్నట్లు తెలిసింది.
పోలీసుల దాడిలో భారీగా మద్యం, హుక్కా, గంజాయి పట్టుబడింది. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు అయిన యువకులు పాత బస్తీకి చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం.